ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కొనియాడారు. భవిష్యత్‌ను చూసి ఆస్వాదించాలనుకునేవారు భారత్‌కు వచ్చి పనిచేయాలని సూచించారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం దక్కినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. భారత్‌తో భాగస్వామ్యానికి అమెరికా ఎంతో ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ దేశానికి పాఠాలు బోధించడానికి రాలేదని, నేర్చుకోవడానికి వచ్చామని ఆయన వ్యాఖ్యానించారు.