ఇదే నిజం, సిరిసిల్ల : మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో మహిళలను వేధిస్తున్న పోకిరిలపై 5 కేసులు పెట్టగా.. అందులో 4 కేసులు నమోదు చేశామని చెప్పారు. మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే 87126564425, లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంతోపాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.