– మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు
ఇదేనిజం, పటాన్‌చెరు : అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన కృషి మరచిపోలేనిదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సమాజంలోని అసమానతలను తొలగించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో చిట్కుల్ అంబేడ్కర్ యూత్ అధ్యక్షులు చిన్న, వైస్ ప్రెసిడెంట్ రాజు, ప్రవీణ్, అనిల్, మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, నారాయణరెడ్డి, నర్సింహులు, వెంకటేశ్, ఈవో కవిత, వార్డు మెంబర్లు వెంకటేశ్, మురళీ, ఎన్‌ఎంఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.