Homeహైదరాబాద్latest Newsప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఆయన నివాసం వద్ద ప్రచార వాహనాలను కార్పొరేటర్లు మాధవరం రంగారావు, నార్నే శ్రీనివాసరావు తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రచార రథాలు గల్లీ గల్లీ, వాడ వాడ తిరిగేలా ముమ్మరంగా ప్రచారం చేసి కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కానుకగా ఇవ్వాలని శ్రేణులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నాయకులు భిక్షపతి ముదిరాజు, సంతోష్ రావు, కాశినాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, రాజేష్ చంద్ర, రాము, జగన్  పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img