పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీరమల్లు నుంచి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘శ్రీరామ నవమి శుభాకంక్షలు. మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.