సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ X వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి వరుసగా రెండోసారో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడం గర్వకారణమన్నారు. వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్యరెడ్డి, నందాల సాయి కిరణ్, కేఎన్ చందన జాహ్నవి, మెరుగు కౌశిక్‌లకు , వారి తల్లిదండ్రులకు శుభాభినందనలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ప్రతిష్టాత్మక సివిల్స్‌లో గత కొన్నేళ్లుగా తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటుతుండటం గర్వకారణంగా ఉందన్నారు.