హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల ‘War2’ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ముంబైలో వేగంగా జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ పాల్గొంటుండగా పలు కీలక సీన్స్ చిత్రీకరిస్తోంది యూనిట్. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుండి ఎన్టీఆర్, హృతిక్ ల పిక్స్ లీక్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ కూడా లేటెస్ట్ స్టైలిష్ లుక్స్ లో ఈ పిక్స్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా వార్ 2 మూవీని వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల చేయనున్నారు.