నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దుబాయ్‌లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. దుబాయ్‌లో వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది. దుబాయ్ విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.