Homeహైదరాబాద్latest NewsHYD : సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో విచ్చలవిడిగా డ్రగ్స్

HYD : సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో విచ్చలవిడిగా డ్రగ్స్

తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ మొత్తంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వారిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నట్లు తేలింది. డబ్బు అధికంగా సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ దారుణానికి ఒడుగట్టామని విచారణలో వెల్లడించారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో భారీగా డ్రగ్స్ సరఫరా జరుగుతోందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

Recent

- Advertisment -spot_img