తెలంగాణలో కొమురంభీం జిల్లా కెరమెరి మండల ఓటర్లు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు పొందారు. వీరికి తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఓటరు కార్డులు మంజూరయ్యాయి. దీంతో వీరు రెండు చోట్లా ఓట్లు వేస్తుంటారు. మహారాష్ట్రలో మొదటి విడత పోలింగ్ ఈ నెల 19న ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు ఓటర్లు ఏదైనా ఒకచోటే ఓటు వేయాలని ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.