Homeహైదరాబాద్latest Newsఆదిలాబాద్ ఎమ్మెల్యే పై కోడ్ ఉల్లంఘన కేసు

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పై కోడ్ ఉల్లంఘన కేసు

ఇదినిజం, ఆదిలాబాద్ ప్రధాన ప్రతినిధి: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పై కోడు ఉల్లంఘన కేసు నమోదయింది. శ్రీరామనవమి సందర్భంగా.. రాముడి ఫోటోల పక్కన ఎమ్మెల్యే ఫోటోలను ఏర్పాటు చేశారు. కాగా.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోకపోవడంతో ప్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పై కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో కోడు ఉల్లంఘన కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img