Homeహైదరాబాద్latest NewsSreeleela: సినిమాలు లేక ఆ యాడ్స్ చేసుకుంటున్న శ్రీలీల

Sreeleela: సినిమాలు లేక ఆ యాడ్స్ చేసుకుంటున్న శ్రీలీల

శ్రీలీల.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసి అనతికాలంలోనే అగ్ర హీరోలతో జతకట్టే స్థాయికి చేరింది. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’, ‘స్కంద’ ‘గుంటూరు కారం’, ‘ఎక్ట్‌ట్రార్డినరీ మ్యాన్‌’ వంటి చిత్రాలతో వరుసగా సందడి చేసిన ఈ భామ జోరు ఇటీవల బాగా తగ్గింది. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మూవీస్‌లో అవకాశాలు లేకపోవడంతో శ్రీలీల ఖాళీగా ఉండకుండా చదువుకుంటూనే పలు యాడ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది.

తాజాగా, శ్రీలీల ఓ సంస్థకు సంబంధించిన స్కూల్ యాడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను శ్రీలీల తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు. అలాగే కొందరు ఎంత తీసుకున్నావ్ ఇలాంటి యాడ్స్ చేసి బ్యాడ్ కాకని సలహాలు ఇస్తున్నారు.

Recent

- Advertisment -spot_img