దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం 71,999.65 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. మధ్యాహ్నం వరకు అదే పంథాలో కొనసాగింది. ఇంట్రాడేలో 71,999.65- 73,210.17పాయింట్ల మధ్య చలించింది. చివరికి 599 పాయింట్లు లాభపడి 73,088.33 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 151 పాయింట్లు లాభపడి 22,147 వద్ద స్థిరపడింది.