ఐపీఎల్ లో సన్ రైజర్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన ఈ మ్యాచ్ లో 67 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. టీ20 అంటేనే ఎంటర్టైన్మెంట్. ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆ ఎంటర్టైన్మెంట్ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. మొదటి బంతి నుంచి చివరి బంతి వరకూ బౌండరీల మోతే. సన్‌రైజర్స్‌ను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాలంటేనే ప్రత్యర్థి జట్లకు భయం పుట్టేలా.. బౌలింగ్ చేయాలంటేనే వణుకు వచ్చేలా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు.