‘యానిమల్’ మూవీలో రష్మిక పాత్ర గురించి.. మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘సందీప్‌రెడ్డి వంగా చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయన ప్రాజెక్టుల్లో నటించాలని ఉంది. ఇటీవల ‘యానిమల్’ చూశా. రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను ధైర్యంగా నిలబడింది. రష్మిక నటన అద్భుతం. అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది’’ అని చెప్పుకొచ్చింది.