Homeహైదరాబాద్latest Newsనేడు హనుమాన్ జయంతి.. ఈ రోజు చేయకూడని పనులు ఇవే

నేడు హనుమాన్ జయంతి.. ఈ రోజు చేయకూడని పనులు ఇవే

రామ భక్తుడైన హనుమంతుడిని సంకత్మోచన అంటారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల కష్టాలు, అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం జరుపుకుంటారు. పౌరాణిక, మతపరమైన విశ్వాసాల ప్రకారం సంకత్మోచన్ హనుమంతుడు ఈ రోజున జన్మించాడు కావునా దేశవ్యాప్తంగా అతని జయంతిగా జరుపుకుంటారు. భక్తులు ఈ రోజున హనుమంతుని దీవెనలు కోరుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న వచ్చింది.

హనుమాన్ జయంతి రోజు మాంసం, మద్యం పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఆరోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు, నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున తెలుపు, నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటమే మంచిది. హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతాన్ని పెట్టకూడదు. వాటితో అభిషేకం చేయకూడదు. భజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు, బూందీ లడ్డు, సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

Recent

- Advertisment -spot_img