Homeహైదరాబాద్latest Newsపాపం.. రుతురాజ్‌ సెంచరీ చేసిన కూడా తన ఖాతాలో ఆ చెత్త రికార్డు…!

పాపం.. రుతురాజ్‌ సెంచరీ చేసిన కూడా తన ఖాతాలో ఆ చెత్త రికార్డు…!

మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ టాప్‌-4లోకి ప్రవేశించింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గి ఓడింది. ఈ సీజన్‌లో సీఎస్‌కేపై ఎల్‌ఎస్‌జీ ఇది రెండో విజయం కావడం గమనార్హం. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌ భారీ స్కోరును కాపాడుకోలేక టాప్-4లో స్థానాన్ని చేజార్చుకుంది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయింది. అయితే సెంచరీ చేసిన రుతురాజ్ మాత్రం ఓ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. సెంచరీ చేసినా జట్టును గెలిపించని ఏకైక సీఎస్‌కే ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాదు రుతురాజ్ ఖాతాలో మరో పేలవమైన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఓడిపోయిన జట్టులో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రుత్రాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు రెండు సెంచరీలు చేశాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ అతని జట్టు ఓడిపోయింది.

Recent

- Advertisment -spot_img