Homeహైదరాబాద్latest Newsఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే.. ఎమ్మెల్యే పదవి వదులుకుంటా: హరీశ్​రావు

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే.. ఎమ్మెల్యే పదవి వదులుకుంటా: హరీశ్​రావు

ఇదే నిజం, తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ లో ఆయన మాట్లాడారు. ‘సీఎం రేవంత్ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా. ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చేయాలి. పూర్తిగా రుణమాఫీ చేయాలి. ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను.

రుణమాఫీ చేయక పోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా?’ అని హరీశ్‌రావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమని హరీశ్​రావు తెలిపారు. ‘కొడంగల్‌లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తే పార్టీ రద్దు చేసుకుంటరా అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ లేఖ రాశారు. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి?’ అని హరీశ్​రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని

Recent

- Advertisment -spot_img