Homeహైదరాబాద్latest Newsఓటిటి లో హీరో గోపీచంద్ ‘భీమా’!

ఓటిటి లో హీరో గోపీచంద్ ‘భీమా’!

కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం “భీమా”. ఈ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది అయితే నేటి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ లో ఆడియన్స్ కి అందుబాటులోనికి వచ్చింది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ మరియు మళయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో వికె నరేష్, నాజర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, ముకేశ్ తివారి కీలక పాత్రలు చేసారు. ఈ సినిమాకి కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ గా నిర్మించారు.

Recent

- Advertisment -spot_img