Homeహైదరాబాద్latest Newsటీ20 వరల్డ్ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా ఉసెన్ బోల్ట్‌

టీ20 వరల్డ్ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా ఉసెన్ బోల్ట్‌

జమైకన్ రన్నింగ్ చిరుత, 8 సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత ఉసేన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్2024 కి బ్రాండ్ అంబాసిడర్ ICC నియమించింది. T20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి 29 వరకు అమెరికా మరియు వెస్టిండీస్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా T20 ప్రపంచ కప్ 2024కి ప్రజాదరణను తీసుకురావడానికి ICC వరల్డ్ బెస్ట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్డ్‌ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. స్ప్రింటర్‌గా ఉసెన్ బోల్ట్ సంచలన రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఉసెన్ బోల్ట్ 2016 రియో ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించి.. ట్రిపుల్ ట్రిపుల్ రికార్డు నమోదు చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఉసేన్ బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4×100 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించాడు. 100 మీటర్లను 9.58 సెకన్లలో, 200 మీటర్లను 19.19 సెకన్లలో, 4×100 మీటర్లను 36.84 సెకన్లలో పూర్తి చేసి ఛాంపియన్‌గా నిలిచాడు.

Recent

- Advertisment -spot_img