Homeహైదరాబాద్latest Newsటీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ కి బీసీసీఐ ప్లాన్…?

టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ కి బీసీసీఐ ప్లాన్…?

ఐపీఎల్‌ తర్వాత భారత ఆటగాళ్లు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నారు. జూన్ 2న ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ జూన్ 29న ముగియనుంది. వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా ఈసారి కప్ గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు. భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చేందుకు బీసీసీఐ తీవ్రంగా కృషి చేస్తోంది. బలమైన జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లకు కీలక సూచనలు చేసింది. బీసీసీఐ భారత మాజీ క్రికెటర్ల అభిప్రాయాలను కూడా స్వాగతించింది. అయితే ప్రపంచకప్‌కు ముందే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
మహేంద్ర సింగ్ ధోనీని తిరిగి టీమ్ ఇండియాలో చేర్చుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ధోనీకి ఆటగాడిగా కాకుండా మెంటార్‌గా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న ధోనీ డ్రెస్సింగ్ రూమ్ లో భారత జట్టుకు అదనపు బలం చేకూర్చాలని బీసీసీఐ భావిస్తోంది. 2021లో దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ధోనీ మెంటార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మెగాటోర్నీలో భారత్‌ విజయం సాధించలేకపోయింది. సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ధోనీ తిరిగి మెంటార్ బాధ్యతలు ఒప్పుకుంటాడా? లేదా? చూడాలి.

Recent

- Advertisment -spot_img