Homeహైదరాబాద్latest NewsIPL 2024: మోహిత్‌ శర్మ పేరిట చెత్త రికార్డు

IPL 2024: మోహిత్‌ శర్మ పేరిట చెత్త రికార్డు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ పేరిట చెత్త రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్‌ ఖాతాలోకి చెత్త రికార్డు చేరింది. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు వేసిన మోహిత్‌ ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు. అలాగే ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. గతంలో ఈ రికార్డు 2018 ఎడిషన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ బాసిల్‌ థంపి 4 ఓవర్లు వేసి 70 పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును మోహిత్‌ శర్మ పేరిట బద్దలు కొట్టాడు.

Recent

- Advertisment -spot_img