దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఓటర్లు సైతం ఇబ్బందిపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నేడు మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వంముగిసింది. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది.