Homeహైదరాబాద్latest Newsరెండో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

రెండో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

దేశంలో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 8.08 కోట్లు, మహిళలు 7.8 కోట్లు, ఇతరులు 5,929 మంది ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా..పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలప్పుళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల వరకు ఓ మోస్తరు పోలింగ్ శాతం నమోదైంది. త్రిపురలో 16.65 శాతం, బెంగాల్‌లో 15.68 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 15.42శాతం, కర్ణాటకలో 9.21శాతం, రాజస్థాన్‌లో 12 శాతం, అస్సాంలో 9.15 శాతం పోలింగ్ నమోదైంది.

Recent

- Advertisment -spot_img