ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి ఊరేగింపుకు వెళ్లి వస్తున్న కారు రైలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కారులో చిక్కుకున్న వారిని రక్షించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.