నిజామాబాద్ జిల్లాకు చెందిన బాధవత్ సాయి ప్రసన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసీలో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీఐ ఇందూర్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తైక్వాండో విద్యార్ధికి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు రావడం అభినందనీయమని అన్నారు. శుక్రవారం విద్యార్థినిని తైక్వాండో అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.