వర్షాలు పడితేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. నెలవారీ సమీక్షలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలను ఆ శాఖ పరిశీలించింది. ఈ సారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణశాఖ చెప్పిందన్నారు. ఫిబ్రవరిలో రిటెయిల్ ద్రవ్యోల్బణం 8.7% కాగా, మార్చిలో ఇది 8.5 శాతానికి తగ్గిందని చెప్పింది. బ్రెజిల్ నుంచి పెసరపప్పు, అర్జెంటీనా నుంచి కందుల దిగుమతికి చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.