పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. అయితే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “హరిహర వీరమల్లు” టీజర్ కట్‌ని నిన్న మేకర్స్ విడుదల చేశారు .ఈ టీజర్ ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. నైజం నవాబు కాలంలో ప్రజల కోసం పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ తన పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. అంతే కాకుండా సినిమాలోని విజువల్స్ ఊహించని విధంగా ఉన్నాయి. అయితే టీజర్ లో ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందనే ట్విస్ట్ తో.. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ఎప్పుడనేది మరింత ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా డిసెంబరు 20న లేదా క్రిస్మస్ కి రానుంది అని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.