సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో ఎంఎస్ ధోనీ లేటుగా రావడంపై ఇటీవల పలువురు విమర్శలు చేశారు. ఆయనకు తొడ కండరాల గాయం ఉండటమే దీనికి గల కారణమని సీఎస్కే వర్గాలు తెలిపాయి. ‘ఈ ఐపీఎల్ కు ముందే ధోనీకి గాయం ఉంది. వైద్యులు రెస్ట్ తీసుకోమన్నారు. జట్టులో కీపర్ అయిన కాన్వే కూడా లేకపోవడంతో ఆయన ఆడక తప్పడం లేదు. అందుకే వీలైనంత లేటుగా బ్యాటింగ్ కు వస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఆడుతున్నారు’ అని తెలిపాయి.