ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ శాడిస్ట్ గా మారి కట్టుకున్న భర్తను చిత్రహింసలు పెట్టింది. చాలా స్టోరీలలో పెళ్లాయ్యాక భర్తలు తమ భార్యలను వేధించడం చూస్తుంటాం. కట్నంతేలేదని, భార్య అందంగా లేదని భర్తలు వేధిస్తుంటారు. మరికొందరు భార్యకు వండటం రాలేదని, కూరలో ఉప్పు తక్కువగా వేసిందని శాడిజం చూపిస్తుంటారు. అంతేకాకుండా.. భార్యపట్ల అనుమానంతో ఉంటారు. ఎవరితో మాట్లాడిన, ఏంపనిచేసిన కూడా వేధిస్తుంటారు. భార్య ఆఫీసుకు వెళ్లి, ఇంట్లో వాళ్లతో మాట్లాడిన కూడా అనుమానంతో ఉంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. భర్తలే ఎందుకు వేధించాలి.. భార్యలు ఎందుకు టార్చర్ చేయకూడదని అనుకున్నారో.. ఏంటో కానీ.. కొందరు మహిళలు తమ భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు.
తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మెహర్ జహాన్, మనన్ జైదీలకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి తర్వాత నుంచి భార్యవేరుగా కాపురం ఉందామంటూ భర్తకు టార్చర్ చూపించింది. దీంతో భార్య పొరుపడలేక, మరో చోటికి వెళ్లిపోయారు. ఈక్రమంలో .. మెహార్ జహన్ అప్పటి నుంచి భర్తకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. ప్రతిరోజు రాత్రి సిగరేట్ లు తాగి,భర్తను వేధించేది. ఏమన్నా అంటూ రివర్స్ లో కేసు పెడుతానంటూ ఇబ్బందులకు గురిచేసేంది. అంతేకాకుండా.. భర్తకు మత్తుపదార్థం కల్పిన పానీయం తాగించేది. అతను నిద్రలోకి జారుకున్నాక.. అతని కాళ్లు చేతులను కట్టేసీ, సిగరేట్ లో తాగి, అతని ప్రైవేటు పార్ట్ లకు చురకలు పెట్టేది. ఒళ్లంతా సిగరేట్ తో వాతలు పెట్టేది. భార్య వేధింపులు భరించలేక అనేక సార్లు కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అతని మాటలు ఎవరు పట్టించుకోలేదు. చివరకు ఒక రోజు గదిలో వీడియో పెట్టాడు. ఆ రోజు రాత్రి రోజులాగే.. మెహార్ జహాన్ రెచ్చిపోయింది.
భర్తను మత్తు కల్పిన ఆహారం ఇచ్చి , అతని కాళ్లు చేతులు కట్టేసి, అతనిపై ఎక్కి కూర్చుంది. అంతేకాకుండా సిగరేట్ తాగుతూ, అతని ప్రైవేటు పార్ట్ లకు వాతాలు పెట్టింది. ఈ ఘటన అంతా అక్కడి ఫోన్ లో రికార్డు అయ్యింది. ఉదయం లేచాక..మనన్ జైదీ ఫోన్ లోని రికార్డు అయిన వీడియోను పోలీసులకు ఇచ్చి తన ప్రాణాలు కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాడిస్టు భార్యను అదుపులోకి తీసుకున్నారు. భార్య వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని, అతని అడ్డు తొలగించుకునేందుకు,ఇలా శాడిజం పనులు చేసిందని భర్త కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.