Homeహైదరాబాద్latest NewsIPL-2024: అరుదైన ఫీట్ ను అందుకున్న చాహల్.. టీ20 చరిత్రలో ఏకైక భారత బౌలర్ గా..!

IPL-2024: అరుదైన ఫీట్ ను అందుకున్న చాహల్.. టీ20 చరిత్రలో ఏకైక భారత బౌలర్ గా..!

ఐపీఎల్ 2024 సీజన్‌లో మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చాహల్ నిలిచాడు. నిన్న మ్యాచ్ లో రిషబ్ పంత్‌ను క్యాచ్ అవుట్‌ చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని చాహల్ అందుకున్నాడు. చాహల్ 301 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఈ గౌరవాన్ని అందుకున్న 11వ బౌలర్‌గా నిలిచాడు. చాహల్ కంటే ముందు డ్వేన్ బ్రేవో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహిర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగ, సొహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ ఈ ఘనత సాధించారు.

Recent

- Advertisment -spot_img