Hyderabad : ఇంటర్నెట్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చేస్తోన్న విన్యాసాలపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఘాటుగా స్పందిచారు. బైక్‌పై ముగ్గురు యువకులు ప్రమాదకరంగా వెళ్తూ తీసిన వీడియోను షేర్ చేస్తూ యువతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిచ్చిపచ్చి వేశాలు వేస్తోన్న ఇటువంటివాళ్ల చేష్టలకు తల్లిదండ్రులే కారణమంటూ మండిపడ్డారు. పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే యువత వెర్రివేషాలు వేస్తోందంటూ ఫైర్ అయ్యారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి రవాణాశాఖకు బదిలీ అయిన సజ్జనార్ త్వరలో మరో శాఖకు బదిలీ కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే యువతను టార్గెట్ చేస్తున్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.