Homeహైదరాబాద్latest News25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి?

25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి?

జూన్ 5న 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినవాళ్లు కూడా ఎన్నికల తర్వాత తమ పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్​లో నిర్వహించిన మీట్ ది ప్రెస్​లో ఆయన పాల్గొని మాట్లాడారు.

డీలిమిటేషన్ తరువాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 154 కు పెరుగుతాయన్నారు. 154లో 125 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాక సోనియా గాంధీ కాళ్లను కేసీఆర్‌ మొక్కారని తెలిపారు. అప్పటి టీఆర్​ఎస్​ (బీఆర్​ఎస్​)ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మోసగించారని మండిపడ్డారు.

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశంలో ఎన్నికలే జరగవని, ఓట్ల కోసం ఆయన మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. దేశం మొత్తం బీజేపీ నాయకుల ఆధీనంలోకి వెళ్తుందని పేర్కొన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img