ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఉరుకులు పరుగుల ప్రపంచంలో ఈ వీడియోలు కాస్త ఉపశమనాన్ని ఇస్తూ ప్రజల్లో ఒత్తిడిని తగ్గిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై క్రియేట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఎన్నికల తరువాత ముగ్గురూ కలిసి అల్లు అర్జున్ లేటెస్ట్ సాంగ్ పుష్ప పుష్ప కు స్టెప్పులేస్తున్నట్లు అందులో ఉంది. ఇది చూసిన నెటిజెన్లు ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని, మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు. ప్రముఖులపై ఫన్నీగా క్రియేట్ చేస్తోన్న వీడియోలను సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఈ విధానానికి చాలామంది అలవాటు పడి ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.
ఈ మధ్యే మోదీ పబ్లిక్‌గా డ్యాన్స్ చేస్తోన్న వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేయగా.. ప్రధాని స్పందిస్తూ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉండగా మీలాగే నేను కూడా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు.