ఎంపీలు నవనీత్ కౌర్, అసదుద్దీన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఎంపీ నవనీత్ కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
’15 సెకన్లు పోలీసులను తప్పిస్తే ఒవైసీ బ్రదర్స్ ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే వెళ్తారని’ అన్నారు.
దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ’15 సెకన్లు ఎందుకు? గంట సమయం తీసుకోండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ఏం చేస్తారో చేయండి. మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో చూస్తాం. భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ. మేము సిద్ధంగా ఉన్నాం’ అంటూ సవాల్ విసిరారు.
15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే 100 కోట్ల మంది హిందువుల అంతు చూస్తామని 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. నాటి ఈ వ్యాఖ్యలకు నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు