Homeహైదరాబాద్latest NewsVIRAL: భలే ఐడియా గురూ.. ఎన్నికల ఆహ్వాన పత్రిక.. నెట్టింట వైరల్

VIRAL: భలే ఐడియా గురూ.. ఎన్నికల ఆహ్వాన పత్రిక.. నెట్టింట వైరల్

ఎన్నికల మహోత్సవానికి రండి.. రారండి అంటూ ముద్రించిన ఆహ్వాన పత్రిక నెట్టింట వైరలవుతోంది. ‘ఐదేళ్లకోసారి జరిగే ఈ మహోత్సవంలో అందరూ పాల్గొని నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరముంది. 13న ఉ.6 నుంచి సా.5 గంటల వరకు మీ పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఓటేయండి. విందులో ఫ్రూట్స్, బిస్కెట్స్ వంటివి ఉంటాయి. లేదంటే ఇంట్లోనే తినిరండి’ అని అందులో రాసి ఉంది. పత్రికలో భవదీయులు.. ‘తలరాతను మార్చే శక్తి ఈ ఓటు’ అని ఉండటం విశేషం.

Recent

- Advertisment -spot_img