ఢిల్లీ మెట్రో రైలులో ఆకతాయిల ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ నెల 3న రాత్రి మెట్రోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగింది. తన పక్కన 28 ఏళ్ల వ్యక్తి కూర్చొని అసభ్యంగా తాకాడని తన అనుభవాలను ట్వీట్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లోని సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితుడిని అరెస్టు చేశారు.