రక్షణ విభాగంలో పని చేసే వ్యక్తి వలపు వలలో చిక్కుకున్నాడు. ఆమెకు రక్షణశాఖ రహస్యాలను చేరవేసి జైలుపాలయ్యాడు. భారత దళాలకు క్షిపణి విడిభాగాలను సరఫరా చేసే ఓ సంస్థలో ప్రవీణ్ మిశ్రా పని చేస్తున్నాడు. అతనికి ఫేస్‌బుక్‌లో సోనాల్ పరిచయమైంది. తను చండీఘడ్‌లోని ఐబీఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పుకొంది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆపరేటీవ్.ఇది తెలియని ప్రవీణ్ ఆమెకు రక్షణ రహస్యాలను చేరవేసి జైలుపాలయ్యాడు.