ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఎల్లుండి తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తో పాటు మరో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం జగన్ 106 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. 16 సిద్ధం సభలు, 34 బహిరంగ సభలు , 14 రోడ్‌షోలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు 89 సభల్లో పాల్గొనగా.. 43 సభల్లో పవన్ ప్రచారం నిర్వహించారు. 12 సభల్లో టీడీాపీ-జనసేన ఉమ్మడిగా ప్రచారం చేశాయి. 120 సమావేశాల్లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. ప్రధాని మోదీ 4 సభలు, ఒక రోడ్‌షోలో పాల్గొన్నారు. ఏపీలో 4.14 కోట్లమంది ఓటర్లు ఉండగా.. 46 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 12వేలకు పైగా సమస్యాత్మకమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఎన్నికలు ముగిసే వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటూ అధికారులు తెలిపారు. వైన్ షాపులు, బార్లు బంద్ అయ్యాయి. బల్క్ ఎస్ఎంఎస్లు చేస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు చెప్పారు.