Homeహైదరాబాద్latest NewsHappy Mothers Day 2024: తల్లి ప్రేమ ప్రపంచంలోనే గొప్పది.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..

Happy Mothers Day 2024: తల్లి ప్రేమ ప్రపంచంలోనే గొప్పది.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..

తనను పెంచి పోషించిన తల్లి గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం నాడు అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని (మదర్స్ డే) అనేక దేశాల్లో జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడే రియా దేవత గౌరవార్థం గ్రీస్‌లో ఈ పండుగను మొదట నిర్వహించారు. అమ్మ కనిపించే దైవం. తల్లి ప్రేమ ప్రపంచంలోనే గొప్పది. అలాంటి అమ్మకు ఈరోజు అంకితం.
ఈ సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమ పంచేది అమ్మ. అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. తన పొత్తిళ్ళలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. మన ఇష్టాల కోసం అమ్మ తన ఇష్టాలను త్యాగం చేస్తుంది. మన ఆనందాన్నే తన ఆనందంగా భావిస్తుంది. కుటుంబం కోసం అమ్మ చూపించే ప్రేమ, శ్రద్ధా, త్యాగం ఎనలేనివి. అలాంటి అమ్మ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఈరోజున తనతో సమయం గడిపి మాతృదినోత్సం జరుపుకుందాం. అమ్మను మన మనసులో నిలుపుకుందాం. మన జీవితంలో, మన దినచర్యలో ఒక భాగంగా చేసుకుందాం. అమ్మకి ఏ లోటూ రాకుండా చూసుకుందాం. అమ్మ మనింట్లో ఉంటే మా అమ్మను నేను చూసుకుంటున్నాను అని పొరపాటున కూడా అనవద్దు. అది మన బాధ్యత. నా అదృష్టం మా అమ్మ దగ్గర నేను ఉన్నాను అని చెప్పడమే అమ్మ పట్ల మనం చూపించే నిజమైన కృతజ్ఞత.

Recent

- Advertisment -spot_img