– గడువు ముగిసినా.. కొనసాగుతున్న ప్రచారం
– నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. పట్టించుకోని అధికారులు
ఇదేనిజం, కరీంనగర్ : ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసినా అభ్యర్థులు యథేచ్ఛగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఒక్క ఓటు కూడా చేజారకూడదు అన్నట్టుగా అభ్యర్థులు తమ సోషల్ మీడియా వారియర్స్‌తో ప్రచారం చేయించారు. దాదాపు రెండు నెలల పాటు పార్టీల లీడర్లు, అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ఎంత ప్రచారం చేశారో.. అంతకు మించిన ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆయా పార్టీలు, నేతలు సొంతంగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. చివరి ప్రయత్నంగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రాం ఇలా దేన్నీ వదలకుండా అన్నింటా ప్రచారం చేస్తున్నారు. ఏ యాప్ ఓపెన్ చేసినా తమ పార్టీలకు సంబంధించిన పోస్టులు, పార్టీ హామీలు, చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, ఇలా ప్రతీది గ్రామ స్థాయిలో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.