CSK ఫ్యాన్స్‌కు ఓ న్యూస్. అది గుడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూస్ ఆ అనేది కొద్ది నిముషాల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడుతోంది. అయితే ఏంటంటారా? దీనికి సంబంధించి చెన్నై టీం తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్టు చేసింది. మ్యాచ్ అయిపోయాక ఫ్యాన్స్ అందరూ వేచి ఉండాల్సిందిగా కోరింది. కారణమేంటో స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ అది ధోనీ గురించే అయ్యుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్.. ‘ఐపీఎల్లో ఎంఎస్ ధోనీకిది చివరి మ్యాచా?’, ‘అదేంటో చెప్పండి. మాకు హార్ట్ఎటాక్లు తెప్పించకండి’, ‘తప్పకుండా మమ్మల్ని బాధపెట్టే ప్రకటన ఏదో చేసేలా ఉన్నారు’. అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ధోనీ బ్యాక్ పెయిన్‌తో బాధపడడుతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పదేపదే తన నడుంకు ఉన్న బెల్టును సరిచేసుకుంటూ కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి.