కోల్‌కతా నైట్ రైడర్స్ పై గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్‌కు వరుణుడు షాక్ ఇచ్చాడు. కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దైంది. ప్రతికూల వాతావరణం కారణంగా టాస్‌ను ఆలస్యంగా వేస్తామని తొలుత నిర్వాహకులు ప్రకటించారు.కానీ ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. అయితే రాత్రి 10.30 గంటలకు వరుణుడు కరుణించాడు. కవర్లు పిచ్ నుండి తీయబడ్డాయి. మ్యాచ్ కనీసం ఐదు ఓవర్ల పాటు సాగుతుందని అందరూ భావించారు. కానీ గుజరాత్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అయినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. ఈ మ్యాచ్ రద్దుతో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలా అంటే.. రద్దు కారణంగా రద్దు కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 11 పాయింట్లు చేరాయి. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినా.. గరిష్టంగా 13 పాయింట్లు సాధిస్తుంది. ఇప్పటికే నాలుగు జట్లు 13 పాయింట్లకు పైగా స్కోర్ చేశాయి.