న్యూస్ క్లిక్ వెబ్‌సైట్ (NewsClick) వ్యవస్థాపకుడు పురకాయస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జైలు నుంచి విడుదల చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యూస్ క్లిక్‌కు చైనా నుంచి రూ. వేల కోట్లలో నిధులు అందుతున్నాయని గతేడాది న్యూయార్క్ టైమ్స్ సహా పలు పత్రికలు కథనాలు రాశాయి. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, దిల్లీ పోలీసులు స్పందించారు.
ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసి, దేశవ్యాప్తంగా ఆఫీసులు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వెబ్‌సైట్ వ్యవస్థాపకుడైన ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా సరైన ఆధాారాలు లేకపోవడంతో కోర్టు ఆయనను విడుదల చేయాల్సిందిగా తీర్పును వెలువరించింది.