Homeఫ్లాష్ ఫ్లాష్Dhoni Bowling: నెట్స్‌లో ధోనీ బౌలింగ్.. ఆర్సీబీకి చెక్ పెట్టడానికి ఇది కొత్త వ్యూహమా..?

Dhoni Bowling: నెట్స్‌లో ధోనీ బౌలింగ్.. ఆర్సీబీకి చెక్ పెట్టడానికి ఇది కొత్త వ్యూహమా..?

IPL-2024 లీగ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి దశకు చేరుకున్నాయి. మిగిలిన బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌లో CSK గెలిస్తే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌పైనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆర్సీబీని ఎదుర్కొనేందుకు ధోనీ కొత్త బాధ్యతను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి 18న బెంగళూరు-చెన్నై జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైన మ్యాచ్ కానుంది. ఎందుకంటే కోహ్లీకి ఈ డేట్ అంటే చాలా ఇష్టం. ఈ తేదీన RCB మరియు చెన్నై మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి ఈ రెండింటినీ RCB గెలుచుకుంది. ఈ తేదీన గతలో జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు చెన్నై జట్టు సిద్ధమైంది. ఈ కీలక మ్యాచ్ కోసం చెన్నై ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ధోని బౌలింగ్ చేస్తున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img