తెలంగాణలోని ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అదిరిపోయే శుభవార్త చెప్పింది.హైదరాబాద్ మెట్రో రైలు వేళలను అధికారులు పొడిగించారు. రాత్రి చివరి రైలు ప్రస్తుతం 11.00 గంటలకు ఉంది. అయితే ఇక నుండి 11.45 వరకు నడుస్తుంది. ప్రతి సోమవారం, మెట్రో సేవ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఇతర రోజుల్లో ఉదయం 6 గంటల నుండి నడుస్తుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.