వాట్సాప్ మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘డిలీట్ ఫర్ ఆల్’, ‘డిలీట్ ఫర్ మీ’ ఫీచర్ల గురించి తెలిసిందే. అయితే కొన్నిసార్లు పొరపాటున డిలీట్ ఫర్ ఆల్ బదులుగా డిలీట్ ఫర్ మీ నొక్కుతుంటాం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘అన్ డూ డిలీట్ ఫర్ మీ’ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. దీంతో డిలీట్ ఫర్ మీ చేసిన మెసేజ్‌ను అన్ డూ చేసుకొవచ్చు. అయితే ఇది కేవలం 5 సెకన్లు మాత్రమే ఉంటుంది.