మరికాసపట్లో చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ధోనీతో ఆడటంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మహీభాయ్‌తో మరోసారి మ్యాచ్ ఆడబోతున్నా. నాకు తెలిసి ఇదే చివరిదేమో మేమిద్దరం ఆడటం. అతడు కొనసాగుతాడో? లేదో? అనేది ఎవరికి తెలుసు. తప్పకుండా ఇది ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. మేమిద్దరం భారత్ తరఫున చాలా ఏళ్లు కలిసి ఆడాం’’ అని అన్నారు.