తెలంగాణ కేబినెట్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అయితే జూన్ 4లోపు అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని ఆదేశించిన ఈసీ. ఎన్నికల కోడ్ ముగిసే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతుల రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని ఆదేశించింది. అయితే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారులను మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానించరాదని సూచించింది. అయితే ధాన్యం సేకరణ, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ జన్మదిన వేడుకలు, జూన్ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించే యోచన వంటి అంశాలకే కేబినెట్ పరిమితం కానుంది.