Homeహైదరాబాద్latest NewsHBD JR NTR: ఎన్టీఆర్‌.. 'గ్లోబర్ స్టార్'గా ఎలా ఎదిగాడు..!

HBD JR NTR: ఎన్టీఆర్‌.. ‘గ్లోబర్ స్టార్’గా ఎలా ఎదిగాడు..!

టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమానుల మనసును దోచుకున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

బాల రాముడి నుంచి కొమరంభీం
నందమూరి తారకరామారావు వారసుడుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. రామాయణంలో మెప్పించారు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. 30వ మూవీగా ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు.

సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్.. ఎన్టీఆర్‌
ఏక సంతా గ్రహి అనే మాట ఎన్టీఆర్ కి సరిగ్గా నప్పుతుంది. డైలాగ్ పేపర్ ఒక్కసారి చూస్తే చాలు.. సీన్ పూర్తయ్యే వరకూ మళ్ళీ గుర్తు చేసుకునే అవసరం లేదు. డ్యాన్స్ విషయంలో కూడా ఇంతే. చిన్న‌ప్పుడే భ‌ర‌త‌నాట్యం, కూచిపూడీలు నేర్చుకుని ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. ఎన్టీఆర్ డ్యాన్సులో ఒక స్పెషాలిటీ వుంది. ఏదైనా మూమెంట్ ని కొరియోగ్రఫర్ ఒకసారి చూపిస్తే చాలు.. రిహార్సల్ అవసరం లేకుండా సింగిల్ టేక్ లో ఫినిష్ చేసేస్తారు.

తాతను మెప్పించిన తారక్‌
తారక్‌ ఓ రోజు మేజర్‌ చంద్రకాంత్‌ షూటింగ్‌ జరుగుతుండగా తన తాత సీనియర్‌ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో sr.NTR ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్‌ వేయమని చెప్పారు. మేకప్‌ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్‌ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్‌ అని కితాబు ఇచ్చారు. మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌ను కోరారట.

NTR అసలు పేరు ఏంటంటే..
జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో ఓ రోజు తనని తీసుకొని రమ్మని హరికృష్ణ కి సీనియర్ ఎన్టీఆర్ చెప్పారట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొని హరికృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. అలా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ని నీ పేరు ఏంటి అని అడగగా నా పేరు తారక రామ్ అని చెప్పారట. అయితే సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ చేయి చూసి తారక రామారావు గా మార్చారు.

జపాన్‌లో ఎన్టీఆర్‌ కు ఫుల్ క్రేజ్‌..
జపాన్‌లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్. గతంలో బాద్‌షా సినిమా జపాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక జపాన్ లో కూడా ఇండియన్ అభిమానులను మించిపోయి తారక్‌ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. గది నిండా ఎన్టీఆర్ బొమ్మలు, ఫొటోలు పెట్టి బర్త్ డే సెలెబ్రేట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రముఖులు
యంగ్ టైగర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. RRR నుంచి వీళ్లిద్దరూ ఉన్న ఫోటో షేర్ చేస్తూ ‘హ్యాపీయెస్ట్ బర్త్ డే టు మై డియరెస్ట్ తారక్’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య ఇప్పటికీ బ్రోమాన్స్ కంటిన్యూ అవుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి’ అని Xలో పోస్టు చేశారు. అలాగే నిన్న దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్‌ను ఉద్దేశించి.. ‘FEAR is FIRE’ అని రాసుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img